Saturday, February 18, 2012

వింటున్నావా వింటున్నావా

పాట: వింటున్నావా వింటున్నావా
చిత్రం: ఏం మాయ చేసావే 
సంగీతం:A .R . రహమాన్ 
గానం: శ్రేయ గోషల్, కార్తీక్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్





రాగా లో వినండి:




యు ట్యూబ్ లో వినండి:



పల్లవి:
పలుకులు నీ పేరే తలుచుకున్న 
పెదవుల అంచులలో అనుచుకున్న
మౌనముతో నీ మదినీ  బంధించా 
మన్నించు ప్రియా 


తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న 
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా


విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్న
చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్న 
ఓ బతికుండగా నీ పిలుపులు నేను విన్న 


చరణం 1:
ఏ.మో ఏ..మో ఏమవుతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో 
విడువను నిన్నే ఇకపైన వింటున్నావా ప్రియ 
గాలిలో తెల్ల కాగితంల నేనల తేలి ఆడుతుంటే 
నన్నే ఆపి నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా 
తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా


చరణం 2 :
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి 
ఆద్యంతం  ఏదో  అనుభూతి  
అనవరతం ఇలా అందించేది 
గగనం కన్నా మునుపటిది 
భూతలం కన్నా ఇది వేనుకటిది 
కాలం తోన పుట్టింది  
కాలం లా మారే మనస్సే లేనిదీ ప్రేమ 


చరణం ౩:
రా ఇలా  కౌగిళ్ళలో నిన్ను దాచుకుంట 
నీదానినై నిన్నే దారి చేసుకుంట 
ఎవరిని కలువని చోటులలోన 
ఎవరిని తలువని వేలలలోన 

తరిమే వరమా తడిమే స్వరమా 
ఇదిగో  ఈ జన్మ నీదని అంటున్న వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా వింటున్నావా


విన్నా వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు 
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా 
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్న 
చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్న 
ఓ బతికుండగా నీ పిలుపులు నేను విన్న 

No comments:

Post a Comment