Friday, February 3, 2012

జన్మమెత్తితిరా అనుభవించితిరా

పాట :  జన్మమెత్తితిరా అనుభవించితిరా
చిత్రం : గుడి గంటలు
సంగీతం: ఘంటసాల
గానం: ఘంటసాల
సాహిత్యం: ఆత్రేయ




రాగ లో ఆస్వాదించండి:


యు ట్యూబ్ లో వీడియో చూడండి:


పల్లవి:
జన్మమెత్తితిరా.. అనుభవించితిరా..
జన్మమెత్తితిరా.. అనుభవించితిరా.. 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
మంది గెలిచి మానవుడుగ మారినానురా..
జన్మమెత్తితిరా.. అనుభవించితిరా.. 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా


చరణం 1:
స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
స్వార్ధమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవశక్తి మృగస్వభునే సంహరించెరా
దైవశక్తి మృగస్వభునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా


చరణం 2:
క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు గొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసే దివ్య మందిరముగా మారిపోయెరా

జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా


చరణం 3:
మట్టి యందే మాణిక్యము దాగియుండురా
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
మట్టి యందే మాణిక్యము దాగియుండురా
మనిషియందే మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా
ప్రతి గుండెలో గుడి గంటలు ప్రతిధ్వనించురా
ఆ దివ్య పదం న్యాయ పధం చూపగలుదురా


జన్మమెత్తితిరా అనుభవించితిరా 
బ్రతుకు సమరంలో పండిపోయితిరా
బ్రతుకు సమరంలో పండిపోయితిరా

No comments:

Post a Comment