Sunday, January 29, 2012

ఓం నమః నయన శ్రుతులకు


పాట: ఓం నమః నయన శ్రుతులకు 
చిత్రం: గీతాంజలి
సంగీతం : ఇళయరాజా
గానం : S.P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 
సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి









రాగా లో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:



పల్లవి:
ఓం నమః నయన శ్రుతులకు 
ఓం నమః హృదయ లయలకు ఓం 
ఓం నమః అధర జతులకు  
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి 
నా హృదయం కనులు తడిసే వేళలో 
ఈ మంచు బొమ్మలోకటై 
కౌగిలిలో కలిసి కరిగే లీలలో 
చరణం 1 :
రేగిన కోరికలతో గాలులు వీచగా 
జీవన  వేనువులలో మోహన పాడగా 
దూరము లేనిదై లోకము తోచగా 
కాలము లేనిదై గగనము అందగా 
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేల
ముద్దుల సద్దుకే  నిదుర రేగే ప్రణయ గీతికి ఓం
చరణం 2 :
ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా 
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై పొంగించే సుధలు మనవైతే 
జగతికే అతిదులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమః నయన శ్రుతులకు 
ఓం నమః హృదయ లయలకు ఓం 
ఓం నమః అధర జతులకు  
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో

Saturday, January 28, 2012

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

పాట: మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (maata raani mounamidi)
చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం: S.P. బాలసుబ్రమణ్యం, S . జానకి




రాగాలో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:


పల్లవి:
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది 
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగామిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం 1:
ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం.. నీకేలా ఇంత పంతం
నింగీ నేలా.. కూడే వేళ.. నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం 2 : 
చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగాల తీగల్లో వీణానాదం.. కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

Friday, January 27, 2012

ఆకాశ దేశాన ఆషాడ మాసాన


పాట: ఆకాశ దేశాన ఆషాడ మాసాన (aakasa deshana aashada masaana)
చిత్రం:  మేఘసందేశం 
సంగీతం : రమేష్ నాయుడు
గానం : కే.జే. యేసుదాసు  





రాగా లో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:





పల్లవి: 
ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా మెరిసేటి ఓ  మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో 
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

చరణం 1 :
వాన కారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై 
వాన కారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై 
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని 
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినికుల బాసలతో 
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా మెరిసేటి ఓ  మేఘమా

చరణం 2 :
రాలుపూలా తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూలా తేనియకై రాతిపూల  తుమ్మెదనై 
ఈ నిశిధీ నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారాలతో
అ... అ... అ....
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన


ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా.. మెరిసేటి ఓ  మేఘమా..
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..  

Tuesday, January 24, 2012

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

పాట       : ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది (Aakasam yenaatido anuragam aanatidi)
చిత్రం      :  నిరీక్షణ
సంగీతం  : ఇళయరాజా
గానం     : S . జానకి


రాగా లో ఆస్వాదించండి:




యు ట్యూబ్ లో వీడియో చూడండి:



పల్లవి:
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో.. ఆనాడే తెలిసిందది..
ఆవేశం ఏనాడు కలిగెనో.. ఆనాడే తెలిసిందది..

ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..

చరణం 1:
ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏపొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే.. ప్రణయాలై..
స్వప్నాలే.. స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగారలీలలు కన్నుల్లో రంగేళి అలడెను


ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..

చరణం 2:
ఏ మేఘం ఏ వానచినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగ
కౌగిలిలో చేరవేసి మదనుని కరిగించి గెలిపించమనగ
మొహాలే.. దాహాలై..
సరసాలే.. సరదాలై..
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు 

ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

Sunday, January 22, 2012

వేదం అణువణున నాదం

పాట       :  వేదం అణువణున నాదం...(vedam anuvanuva nadam)
చిత్రం      :  సాగర సంగమం
సంగీతం  :  ఇళయరాజా
గానం     :   S.P. బాలసుబ్రహ్మణ్యం








రాగా లో ఆస్వాదించండి:


యు ట్యూబ్ లో చూడండి:





పల్లవి :
గా.. మా.. నీ... గమగస మగస గస నీ.. సా.. నిదమగ దమగ మగ సరీ సానీ గమగా రీ గమాగ మదామ దనిద నిదాని రీ

వేదం అణువణువున నాదం ..వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగే ఎన్నో హంసా నంది రాగాలై..
వేదం... వేదం అణువణువున నాదం


చరణం 1:
సాగర సంగమమె ఒక యోగం
నిరిసనిదమగ గదమగరిసని నిరిసనిదమగ మదనిసరీసగారిమగదమగనిదనిసానిదనిమగదమరిగస
సాగర సంగమమె ఒక యోగం సారజలదులె క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయె
పదములు తామె పెదవులు కాగ
పదములు తామె పెదవులు కాగ
గుండియలె అందియలై మ్రోగ
వేదం అణువణువున నాదం
అ..అ..అ...

మాతృ దేవోభవ.. పితృ దేవోభవ..
ఆచార్య దేవోభవ.. ఆచార్య దేవోభవ..
అతిధి దేవోభవ... అతిధి దేవోభవ...


చరణం 2 :
ఏదురాయె గురువైన దైవం యెదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణైపోయె జీవం
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా
వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగే ఎన్నోహంసా నంది రాగాలై... వేదం... వేదం..


జయంతి తె సుకృతినొ రససిద్ధ కవీస్వరా నాస్థితేషాం యషః కాయె జరామరణజం భయం నాస్థి జరామరణజం 
భయం నాస్థి జరామరణజం భయం
వేదం.. వేదం.. వేదం.. వేదం.. వేదం

Saturday, January 21, 2012

ఓంకార నాదాను సంధానమౌగానమే


పాట         : ఓంకార నాదాను సంధానమౌగానమే (Omkaara Naadanu samdanamou ganame)
చిత్రం        : శంకరాభరణం(SankaraBharanam)
సంగీతం    : కే.వి. మహదేవన్.
సాహిత్యం : వేటూరి సుందరరామ్మూర్తి
గానం       : S.P. బాలసుబ్రమణ్యం 






రాగా లో ఆస్వాదించండి.


యు ట్యూబ్ లో చూడండి :




పల్లవి:
ఓం.. ఓం...
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణమూ
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణమూ
శంకరా.. భరణము...
శంకర గళ నిగళము.. శ్రీహరి పద కమలము
శంకర గళ నిగళము... శ్రీ.. హరి పద కమలము
రాగ రత్న మాలిక తరళము శంకరాభరణము...

చరణం 1 :
శారద వీణా..... ఆ.....ఆ...ఆ......
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికులకనురాగమై రస గంగలోతానమై
రసికులకనురాగమై రస గంగలోతానమై
పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణము
శంకరా భరణము...

చరణం 2 :
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సోపానము....
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సోపానము....
సత్వ సాధనకు సత్య శొధనకు సంగీతమే ప్రాణము...
సత్వ సాధనకు సత్య శొధనకు సంగీతమే ప్రాణము....
త్యాగ రాజ హ్రుదయమై.. రాగ రాజ నిలయమై..
త్యాగరాజ హ్రుదయమై రాగరాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము మ్రుతియలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము..

ఓంకార నాదాను సంధానమౌ గానమే.. శంకరాభరణము
పా దా ని శంకరాభరణము
పమగరి, గమపదని శంకరాభరణము
సరిసా, నిదప, నిసరి, దపమ, గరిగ, పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము

అహా..
దపా, దమా, మాపాదపా
మాపాదపా
దపా, దమా, మదపామగా
మాదపామగా

గమమదదనినిరి, మదదనినిరిరిగ
నిరిరిగగమమద, సరిరిససనినిదదప శంకరాభరణము

రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీసరీసనిద
నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దనిద దనిద దని దగరిసానిదప
దా దా ద గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసని
నిసనిదపనీదా సనిదపమప రిసనిదప
సరిదపమ గమమగరి గమదా
నిసనిపద మప నిసనిదప నీ దపమగరి రిసనిదప
నగరిసరిసని శంకరాభరణము
శంకరాభరణము

   

వందనం


అందరికి వందనం. ఈ బ్లాగు ముఖ్యవుధ్ధ్యేశం తెలుగు పాటలు తెలుగులొ అందరికి అందుబాటలొ వుండాలని, మరియు ఇతరములు.

-గారపని