Wednesday, February 8, 2012

నీ సుఖమే నే కోరుతున్నా

పాట: నీ సుఖమే నే కోరుతున్నా 
చిత్రం: మురళీకృష్ణ
సంగీతం : వేణు
సాహిత్యం : సి. నారాయణరెడ్డి 
గానం : ఘంటసాల

రాగ లో ఆస్వాదించండి:

యు ట్యూబ్ లో చూడండి:

చరణం :
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా 
నీ సుఖమే నే కోరుతున్నా 
నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

పల్లవి 1:
అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

పల్లవి 2:
పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాపవలె కాపడినాను
గుండెను గుడిగా చేసాను... గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్లావు
నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

పల్లవి 3:
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా

పల్లవి 4:
నీ కలలే కమ్మగా పండనీ.. నా తలపే నీలో వాడనీ..
కలకాలం చల్లగ ఉండాలనీ దీవిస్తున్నా నా దేవినీ.. దీవిస్తున్నా నా దేవినీ

ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా 
నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నానీ సుఖమే నే కోరుతున్నా 

No comments:

Post a Comment