Friday, January 27, 2012

ఆకాశ దేశాన ఆషాడ మాసాన


పాట: ఆకాశ దేశాన ఆషాడ మాసాన (aakasa deshana aashada masaana)
చిత్రం:  మేఘసందేశం 
సంగీతం : రమేష్ నాయుడు
గానం : కే.జే. యేసుదాసు  





రాగా లో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:





పల్లవి: 
ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా మెరిసేటి ఓ  మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో 
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..

చరణం 1 :
వాన కారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై 
వాన కారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై 
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని 
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినికుల బాసలతో 
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా మెరిసేటి ఓ  మేఘమా

చరణం 2 :
రాలుపూలా తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూలా తేనియకై రాతిపూల  తుమ్మెదనై 
ఈ నిశిధీ నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారాలతో
అ... అ... అ....
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన


ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ  మేఘమా.. మెరిసేటి ఓ  మేఘమా..
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం..  

No comments:

Post a Comment