Tuesday, January 24, 2012

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది

పాట       : ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది (Aakasam yenaatido anuragam aanatidi)
చిత్రం      :  నిరీక్షణ
సంగీతం  : ఇళయరాజా
గానం     : S . జానకి


రాగా లో ఆస్వాదించండి:




యు ట్యూబ్ లో వీడియో చూడండి:



పల్లవి:
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో.. ఆనాడే తెలిసిందది..
ఆవేశం ఏనాడు కలిగెనో.. ఆనాడే తెలిసిందది..

ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..

చరణం 1:
ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏపొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా
పరువాలే.. ప్రణయాలై..
స్వప్నాలే.. స్వర్గాలై..
ఎన్నెన్నో శృంగారలీలలు కన్నుల్లో రంగేళి అలడెను


ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..

చరణం 2:
ఏ మేఘం ఏ వానచినుకై చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసి మరపించమనగ
కౌగిలిలో చేరవేసి మదనుని కరిగించి గెలిపించమనగ
మొహాలే.. దాహాలై..
సరసాలే.. సరదాలై..
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు 

ఆకాశం ఏనాటిదో.. అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది

No comments:

Post a Comment