Showing posts with label S.P. బాలసుబ్రహ్మణ్యం. Show all posts
Showing posts with label S.P. బాలసుబ్రహ్మణ్యం. Show all posts

Sunday, January 29, 2012

ఓం నమః నయన శ్రుతులకు


పాట: ఓం నమః నయన శ్రుతులకు 
చిత్రం: గీతాంజలి
సంగీతం : ఇళయరాజా
గానం : S.P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 
సాహిత్యం: వేటూరి సుందరరామ్మూర్తి









రాగా లో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:



పల్లవి:
ఓం నమః నయన శ్రుతులకు 
ఓం నమః హృదయ లయలకు ఓం 
ఓం నమః అధర జతులకు  
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి 
నా హృదయం కనులు తడిసే వేళలో 
ఈ మంచు బొమ్మలోకటై 
కౌగిలిలో కలిసి కరిగే లీలలో 
చరణం 1 :
రేగిన కోరికలతో గాలులు వీచగా 
జీవన  వేనువులలో మోహన పాడగా 
దూరము లేనిదై లోకము తోచగా 
కాలము లేనిదై గగనము అందగా 
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేల
ముద్దుల సద్దుకే  నిదుర రేగే ప్రణయ గీతికి ఓం
చరణం 2 :
ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా 
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులోకటై పొంగించే సుధలు మనవైతే 
జగతికే అతిదులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమః నయన శ్రుతులకు 
ఓం నమః హృదయ లయలకు ఓం 
ఓం నమః అధర జతులకు  
ఓం నమః మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి
నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలోకటై
కౌగిలిలో కలిసి కరిగే లీలలో

Saturday, January 28, 2012

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

పాట: మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది (maata raani mounamidi)
చిత్రం: మహర్షి
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి 
గానం: S.P. బాలసుబ్రమణ్యం, S . జానకి




రాగాలో ఆస్వాదించండి:



యు ట్యూబ్ లో వీడియో చూడండి:


పల్లవి:
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది 
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగామిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం 1:
ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మ
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ
ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం.. నీకేలా ఇంత పంతం
నింగీ నేలా.. కూడే వేళ.. నీకూ నాకూ దూరాలేలా
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది

చరణం 2 : 
చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మ
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మ
రాగాల తీగల్లో వీణానాదం.. కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లొ రేగే గాయం.. పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది
దూరమిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

Sunday, January 22, 2012

వేదం అణువణున నాదం

పాట       :  వేదం అణువణున నాదం...(vedam anuvanuva nadam)
చిత్రం      :  సాగర సంగమం
సంగీతం  :  ఇళయరాజా
గానం     :   S.P. బాలసుబ్రహ్మణ్యం








రాగా లో ఆస్వాదించండి:


యు ట్యూబ్ లో చూడండి:





పల్లవి :
గా.. మా.. నీ... గమగస మగస గస నీ.. సా.. నిదమగ దమగ మగ సరీ సానీ గమగా రీ గమాగ మదామ దనిద నిదాని రీ

వేదం అణువణువున నాదం ..వేదం అణువణువున నాదం
నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగే ఎన్నో హంసా నంది రాగాలై..
వేదం... వేదం అణువణువున నాదం


చరణం 1:
సాగర సంగమమె ఒక యోగం
నిరిసనిదమగ గదమగరిసని నిరిసనిదమగ మదనిసరీసగారిమగదమగనిదనిసానిదనిమగదమరిగస
సాగర సంగమమె ఒక యోగం సారజలదులె క్షీరములాయె
ఆ మధనం ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయె
పదములు తామె పెదవులు కాగ
పదములు తామె పెదవులు కాగ
గుండియలె అందియలై మ్రోగ
వేదం అణువణువున నాదం
అ..అ..అ...

మాతృ దేవోభవ.. పితృ దేవోభవ..
ఆచార్య దేవోభవ.. ఆచార్య దేవోభవ..
అతిధి దేవోభవ... అతిధి దేవోభవ...


చరణం 2 :
ఏదురాయె గురువైన దైవం యెదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం గురుదక్షిణైపోయె జీవం
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
నటరాజ పాదాన తల వాల్చనా నయనాభిశేకాన తరియించనా
సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా
వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం
నాలో రేగే ఎన్నోహంసా నంది రాగాలై... వేదం... వేదం..


జయంతి తె సుకృతినొ రససిద్ధ కవీస్వరా నాస్థితేషాం యషః కాయె జరామరణజం భయం నాస్థి జరామరణజం 
భయం నాస్థి జరామరణజం భయం
వేదం.. వేదం.. వేదం.. వేదం.. వేదం