Showing posts with label శ్రీ శ్రీ. Show all posts
Showing posts with label శ్రీ శ్రీ. Show all posts

Thursday, February 2, 2012

హాయి హాయిగా జాబిల్లి

పాట: హాయి హాయిగా జాబిల్లి (hai hai ga jabilli)
చిత్రం: వెలుగు నీడలు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, సాలూరి రాజేశ్వర రావు 
గానం : ఘంటసాల, సుశీల.
సాహిత్యం: శ్రీ శ్రీ

రాగ లో ఆస్వాదించండి:

యు ట్యూబ్ లో చూడండి:

పల్లవి:
హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి ..
మందు జల్లి నవ్వసాగే  ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో 
హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం 1 :
తళ తళ మెరిసిన తారక.. తెలి వెలుగుల వెన్నెల దారులా
తళ తళ మెరిసిన తారక.. తెలి వెలుగుల వెన్నెల దారులా
కోరి పిలిచెను తన దరిచేరగా..మది కలచేనో తీయని కోరిక
హాయి హాయిగా జాబిల్లి..తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో..మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం 2 :
మిలమిల వెలిగే నీటిలో.. చెలి కలువల రాణి చూపులో
మిలమిల వెలిగే నీటిలో.. చెలి కలువల రాణి చూపులో
సుమదళములు పూచినా తోటలో.. తొలివలపుల తేనెలు రాలేనో
హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి 
మందు జల్లి నవ్వసాగే ఎందుకో.. మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో

చరణం 3 :
విరిసిన హృదయమే వీణగా.. మధురసముల కొసరిన వేళల 
విరిసిన హృదయమే వీణగా..మధురసముల కొసరిన వేళల 
తొలి పరువములొలికెడు సోయగం.. కని పరవశమొందెనో మానసం 
హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో.. మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో